Sunday, November 11, 2012

       బతుకు తెరువు బాటలో
                   సుడిగుండాల నడుమ
                   చుక్కాని లేని నావనై నే వెళుతుంటే
        సముద్రపు హోరులో నిశిధ రాత్రిలో
                    నా గుండెచప్పుడు నన్నే బయపెడుతుంటే
         నన్ను విడువక నీ మనస్సు
                     వేగుచుక్కై నా వెంట వచ్చిoది...!
          నీ తలపులు చెలి చెంపలలోని కెంపులై
                       ఇంతి మనసున పూబంతులై
           మనసును మురిపించి, ముద్దాడే 
                   నీ చిలిపి ... చిలిపి తలపులు
           నిలువెల్లా నను వరించి దహించి ....!

Saturday, November 10, 2012


"బతుకు తెరువు బాటలో సుడిగుండాల నడుమ
          చుక్కాని లేని నావనై నే వెళుతుంటే

సముద్రపు హోరులో నిశిధ రాత్రిలో నా గుండె
          చప్పుడు నన్నే బయపెడుతుంటే

నన్ను విడువక నీ మనస్సు
         వేగుచుక్కై నా వెంట వచ్చింది.

నీ తలపులు చెలి చెంపలలోని కెంపులై
        ఇంతి మనసున పూ బంతులై

మనసును మురిపించి ముద్దాడు నీ చిలిపి ... చిలిపి తలపులు
         నిలువెల్లా నను వరించి, దహించి ....

కారుమబ్బులు ముసిరిన వేళ పచ్చని పైరువెంట వెళుతుంటే

పిల్ల తుమ్మెర చల్లగా నన్ను తాకిన వేళ
            నులువేచ్చని నీ కౌగిలి తొడుగా వస్తే

నీకౌగిలిలో కరిగిపోయి ఓడిగిపోయినపుడు

నీ పెదవులపై తిరుగాడే అల్లరి తుమ్మెద
         నీ ఆధరాల అనువును ఆస్వాదించిన వేళ

సిగ్గుపడ్డ ఫైరగాలి నా మేను తాకి నీ ఊహల
        కౌగిలి చేర నుండి నన్ను విడిపించింది ప్రియతమా !




                "నిన్నటి దాకా శిలనై వున్నా
                                        నీ స్పర్శ తాకి మలచిన శిల్పాన్ని అయినా

                               నీ చెలిమితో  నా ఆణువణువూ
                                      ప్రేమమయమై
                                         నా ఊపిరి ఓ దీపమై
                                         నా అంతరంగాల గుడిలో
                                                నీకై వెలుగుతూ వుoది

                               ఆ వెలుగులో చిరునవ్వుతో
                                          నీ రూపం కనబడుతుంది "